దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకోవాలి!
కిరణ్ పెద్ద ‘మల్టినేషనల్’ కంపెనీలోఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. అతనికిఇద్దరు పిల్లలు. ఇద్దరినీ బాగాచదివించాడు. ఇద్దరూ చదువులుఅవ్వగానే క్యాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగాల్లోచేరారు. కిరణ్ భార్య ‘పిల్లలకి పెళ్ళిళ్ళుచెయ్యాలని, ఏ వయసులో ఆ ముచ్చటసక్రమంగా జరగాల’ని కోరుకునే వ్యక్తి. ఆమాటే భర్త తో పదే పదే అంటూ ఉంటుంది.
కొడుకు ఏదో ప్రాజెక్ట్ పని మీద అమెరికావెళ్ళాడు. అలా వెళ్ళిన వాడు అక్కడే 3-4 సం.లు ఉండిపోయాడు. కూతురు శాలిని, క్యాంపస్ సెలెక్షన్ లో వచ్చిన ఉద్యోగంచేస్తున్నా కూడా, ‘తన చుట్టు పక్కల వాళ్ళుచాలా మంది ‘అమెరికా’వెళ్ళిచదువుకుంటున్నారని, తను కూడా అలావెళ్ళి చదువుకుంటా నని, అప్పటి వరకుపెళ్ళి చేసుకోనని’ తేల్చి చెప్పేసింది.
‘పిల్లల చదువులు అయిపోయాయి, హాయిగా వేళ పట్టున పెళ్ళి చేసి వాళ్ళని ఒకఇంటి వాళ్ళని చేసి, పదవీ విరమణసమయానికి ఫ్రీ అవ్వచ్చని’ అనుకుంటే, ఇలా పిల్లలు కలిసి రాక, అనుకున్నదిచెయ్యలేక, ఏం చెయ్యాలో పాలుపోక నలిగిపోతున్నది, కిరణ్ భార్య.
ఇవ్వేవీ తెలియక వారి దగ్గర బంధువుకాంతమ్మ గారు, ‘తనకి తెలిసిన సంబంధంఏదో ఉన్నదని, అది కిరణ్ కూతురు శాలినికిఅన్ని విధాలా ఈడూ జోడూ గాఉంటుందని’ చెబుతూ, ‘పిల్లకి పెళ్ళిచెయ్యరా’ అని దీర్ఘాలు తీసింది.
పాపం కిరణ్ భార్య, ‘మాకు చెయ్యాలనేఉన్నదండీ, పిల్లలు అవకాశం ఇవ్వాలి కదా’అన్నది. కాంతమ్మ గారు ‘ఇంకా మీ ఆయనకిఎన్నాళ్ళు సర్వీస్ ఉన్నది’ అని అడిగింది. ‘ఇంకా ఓ ఏడాది ఉన్నదండీ, ఈ లోపుపెళ్ళిళ్ళు అయితే బాగుండునని నేను పడేతాపత్రయం మాత్రం ఆచరణలోకి రావటంలేదు’ అని నిట్టూర్చింది.
‘అదేనమ్మా నేను చెప్పదల్ఛుకున్నదికూడా, అబ్బాయి ఉద్యోగంలో ఉన్నప్పుడైతేకాస్త హంగుగా నిండుగా జరుగుతాయికార్యక్రమాలు, అది పిల్లలు గ్రహించుకుంటేబాగుండును’ అన్నది.
"దీపం ఉన్నప్పుడే కదా ఇల్లుచక్కపెట్టుకోవలసింది" అంటూ, ‘ఈ కాలంపిల్లలు వాళ్ళకి తెలియదు, పెద్దలు చెబితేవినరు. మాయదారి చదువులు వచ్చి పిల్లల్లోమొండితనాలు, మూర్ఖత్వాలుపెరుగుతున్నాయి’ అని నిట్టూర్చింది.
‘డిగ్రీలైతే వస్తున్నాయి కానీ, నేల మీదనిలబడి వాస్తవం ఆలోచించలేకపోతున్నారు. ఎంత సేపు ‘కరియర్’‘కరియర్’ అని తల్లిదండ్రుల కష్టం సుఖంఅర్ధం చేసుకోవట్లేదు’ అని, మొత్తం ఈతరం పిల్లల మీద ఆవిడకున్న అసంతృప్తినివెళ్ళకక్కింది.
సామెత కథ : - ఎం. బిందు మాధవి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి