శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన “ జాతీయ శతాధిక కవి సమ్మేళనం “
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాహిత్య అకాడమీ మెంబెర్ ( పూర్వ ), జాషువా అవార్డు గ్రహీత, అక్షర తపస్వి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి సారథ్యంలో శ్రీ శ్రీ కళా వేదిక పదవ వార్షికోత్సవం సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం జరుపబడినది. శ్రీ శ్రీ కళా వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి, ప్రముఖ కథా / వ్యాస రచయిత చిటికెన కిరణ్ కుమార్ పాల్గొని కవిత వినిపించారు. కిరణ్ ను అనంతరం ఘనంగా సన్మానించారు. బెంగళూరు మరియు ఇతర రాష్టాలనుండి ప్రొఫెసర్లు, వివిధ రాష్ట్రాలనుండి సాహితీ వేత్తలు, గోదావరి పత్రిక సంపాదకులు బోళ్ల సతీష్, రాయవరపు సత్యభామ ( ట్రస్ట్ ) హాజరయ్యారు.
ఈ సందర్బంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.........
సాహిత్యం ద్వారా సమాజానికి సేవచేయాలనే తన సంకల్పానికి శ్రీ శ్రీ కళా వేదిక ఒక అద్భుత వేదిక అని ఈ సాహిత్య వేదికలో తను జిల్లా కార్యదర్శి గా కొనసాగడం చాలా సంతోషం గా ఉందన్నారు. ఇప్పటికి శ్రీ శ్రీ కళా వేదిక ద్వారా 15 ప్రశంసా పురస్కార పత్రాలు అందుకొన్నానన్నారు. ఛైర్మెన్ ప్రతాప్ గారు “కవిత్వం కనిపించాలి - కవిత్వం వినిపించాలి “ అని చెప్పిన విషయాలు చాలా తనను ఆకర్షించాయన్నారు. కవులకు , కవయిత్రులకు సాహిత్యాభిమానులకు సాహితీ ప్రపంచంలో ఒక నూతన మార్గదర్శి గా ఈ వేదిక నిలిచిందన్నారు.
శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మరియు వేదిక సీసీ టీవీ అధ్యక్షులు ఆరవెల్లి నరేంద్ర, వాసుదేవ్, కళా వేదిక కార్యవర్గ జాతీయ సహాయ కార్యదర్శులు కొల్లి రామావతి, జ్యోతి మువ్వల, సంధ్య అయిన్ల, చిట్టే లలిత, ఓ కోయిల నవీన్, చిందం సునీత లు కిరణ్ కుమార్ ను అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి