మగువా
నువ్వు చేయని పోరాటముందా
నువ్వు కాలు మోపని రంగముందా
నువ్వు సాధించలేని
విజయముందా
అడుగు పడినప్పుడల్లా
అడ్డుకున్న చేతులను
తప్పించుకుంటూ
తీర్చుకోలేదా పరుగుల దాహాన్ని
కేరళ ముద్దుబిడ్డ పి.టి.ఉష
గడపదాటని రోజులైనా
ఊహలన్నీ గగనం వైపే
తన అంకుఠిత దీక్షతో
అంతరిక్షం పై కాలు మోపిన
కల్పనా చావ్లా....
చదువులో మేటి
పరిశోధనలు లేరు
ఆమెకు సాటి
రెండు నోబెల్ బహుమతులు సాధించిన మేరీ క్యూరీ....
మహిళా విద్య కు మద్దతు
మలాలా యూసఫ్ జాయ్ ని
వరించింది నోబెల్ బహుమతి
మంగళ్ యాన్ -చంద్ర యాన్
అంతరిక్షంలో అవలీలగా విహరిస్తున్న
అందవేసిన చేయి రాకెట్ ఉమెన్
రీతూ కరిదళ్ ....
అవనిలో సగమై అంతటా తామై
అందరికీ మార్గదర్శకులైన
మహిళా మణులకు ఇవే నా జోహార్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి