ఎందుకలా?:-సత్యవాణి

 ఎందుకలా నీలోనువ్వే గొణుక్కుంటావు?
ఏమిటిలాభం దానివలన?
ఎందుకలా  నీలోనువ్వే సణుక్కొంటావు?
ఏమిసాధించగలవు దానివలన?
ఎందుకలా నీలోనువ్వే పీక్కుంటావు?
ఏమి ప్రాప్తిస్తుంది దానివలన?
ఎందుకలా చీదరించుకొంటావు
నీలోనువ్వు?
గొణుగుడాపి గొంతును ఇప్పు
రణగొణ ధ్వనిచెయ్యి
చీదదరించుకోవడమాపి
చాకిరెవెట్టు నీకన్యాయం జరుతున్నప్పుడు
చావదీరినవానివలెెే ఊరుకోకు
సంఘంతో మాటకలుపు
సమాజంతో చెయ్యికలుపు
ప్రజాసముహంతో గొంతుకలుపు
కావలసినవి నీకాళ్ళదగ్గరకొస్తుంది
సమూహబలం సాటిలేనిది
లే...కూడగట్టు జనాలను
క్రొత్త ఊపిరిలూదు సమాజానికి
కొంగ్రొత్త శక్తినివ్వు ప్రజాస్వామ్యానికి
            
కామెంట్‌లు