ఆదివారం:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఆదివారం ఆనందం
అనంతం అనుకున్నా
కాని.....,
నేను నిద్ర లేచేసరికి
ఎదురుగా కొండంత
హోంవర్క్ నన్నే చూస్తోంది
ఏడుస్తూ హోంవర్క్ చేస్తున్నా
ఎంతకీ తరగడం లేదేం ?
నన్ను చూసి జాలిపడేవారే
కరువయ్యారు ఓరన్నా !
అమ్మానాన్నల కళ్ళన్నీ
నా హోంవర్క్ మీదనే
రోజంతా నత్తనడకే కదా !
అదుగో !
అప్పుడు తట్టింది
నాకు ఆలోచన
ఏరోజుకారోజు
పూర్తిచేసుకుని ఉంటే
గొడవేం లేకపోయేది కదా అని
ఇప్పుడు అనుకుని ఏంలాభం ?
ఇలా నీరసంగా ముగిసింది
ఆనందాల ఆదివారం హు. హు. !!

కామెంట్‌లు