గతి తప్పిన ఆహారవేళలువరుసలేని ఆహారపదార్ధాలు
కొవ్వులు పెంచే నిల్వాహారాలు
అధికమైన స్వీకరణ
వ్యాయామం లేని శరీరం
కూడితేనే ఊబకాయం.
అనేక సమస్యల మయం.
రక్తప్రసరణలు అసనతుల్యమై
గ్లూకోజు అధికోత్పత్తి కారకమై
హృద్రోగాలకు ఆలవాలమై
రోగాలకు వాహకమై
శరీరం పట్టుతప్పుతుంది.
బరువెక్కువై వచ్చే పాట్లు
మోకాళ్ళకు గ్రహపాట్లు
మలబద్ధకానికి ఏర్పాట్లు
ఆయాసం,అజీర్ణాలతో
అల్సర్లు,అవహేళనలతో
చేయాల్సివస్తుంది సహజీవనం.
జంక్ ఫుడ్డు,ఆయిల్ ఫుడ్డుల
అసంఖ్యాక అనర్థాలు
మానవాళి అర్థాయుష్షుకు
అవుతాయి కారణాలు.
శరీరం ఇచ్చే హెచ్చరికలను వినండి!
ఆరోగ్యం కోసం పాటుపడండి!
శరీరవిలాపం:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి