'లొట్టెడు నీళ్లు తాగాము'.... :- ఎన్నవెళ్లి రాజమౌళి , కథల తాతయ్య

 మా నాన్నకు పక్షవాతం వచ్చింది. ఒక దగ్గర అ ఉండడం వలన ఇబ్బంది అనిపించింది అనిపించిందో ఏమో.... మా అమ్మగారు ఊరు కొండాపూర్ కుటుంబంతో వెళ్ళాం. నా అల్లరి భరించలేక, ఒకసారి మా పెద్దమ్మ నన్ను కొట్టింది. మా చెల్లెలు శకుంతల తో... మన ఊరు ఊరు తడకపల్లి వెళ్దాం వస్తావా.... అని అడిగాను. ఆమె సరేనంది. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. మా చెల్లెలు వయస్సు ఆరు సంవత్సరాలు. ఎవరికీ చెప్పకనే బయలుదేరాం. కొండాపూర్ కు మా ఊరు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెళ్ల నైతే వెళ్లాం కానీ.... కాలినడకన ప్రయాణం ఎంతో ఇబ్బంది అయింది. ఇరుకోడు గుట్టల మధ్యకు వచ్చేసరికి విపరీతమైన దాహమయింది. అక్కడ గౌండ్ల వాళ్లు కనపడ్డారు. వాళ్లకు దాహం అయితున్న సంగతి చెప్పాను. మీది ఏ కులం అని అడిగాడు. జంగము  అని అన్నాను. లొట్టిలొ నీళ్లు ఇస్తే తాగుతారా... అని అడుగగా-సరేనన్నాను. లొట్టితో నీళ్లు తెస్థే-ఎండలో నడవడంవలన నేను ఏమోలొట్టెడునీళ్లు తాగాము. అక్కడక్కడ కూర్చుంటూ తడిక పెళ్లికి చేరాము. మేము ఇద్దరమే వెళ్లడం చూసి
.. ఆశ్చర్యపోయిన అక్కడి పెద్దమ్మ ముందుగా అన్నం తినండి అంది. మేము అన్నం తినే సరికి మా మామ అ కొండాపూర్ నుండి వచ్చాడు. ఇద్దరినీ చెరి రెండు దెబ్బలు వేసి... మళ్లీ కొండాపూర్ తీసుకొని వెళ్ళాడు.
కామెంట్‌లు