సాఫల్యం:-చెన్నమనేని ప్రేమసాగర్ రావు

 ప్రశాంతమైన జీవితాన 
అశాంతికి తావేల 
ఉన్నంతలో తృప్తిపడుతు 
జీవన సమరం సాగించవేల 
నెరవేరని ఆశలకై 
మదిలో వగచుటేల 
కర్తవ్యం పాటించు 
కలిసొచ్ఛే రోజులుంటవి 
శ్రమించుట మనధర్మం 
ఫలించుట దైవాదీనం 
మంచితనం నిలుపుకొనుట 
జీవన సాఫల్యం 

కామెంట్‌లు