మల్లేశం, ఆనందం, గురుపాదం, విఠలు వీరు నా మిత్రులు. కొండా పూర్ లో మా ఇంటికి వీళ్ళ ఇళ్లకుఫర్లాంగుకు పైననే దూరం ఉండేది. నేనెప్పుడూ వీళ్ళ ఇళ్లలోనే గడిపేవాడిని. అప్పుడు మేమంతా ఆరవ తరగతి చదువుతుండే వాళ్ళం. కొండాపూర్ కు రెండు కిలోమీటర్ల దూరంలో కల తిమ్మాపూర్ వెళ్ళేవాళ్ళం. ఎంత వీళ్ళ ఇళ్లలో ఉన్నా.... తినడానికి, పడుకోవడానికి ఇంటికి పోవలసిందే కదా! అప్పుడు కూడా అ మాట్లాడుకోవాలి అన్న ఆలోచన వచ్చింది. ఇప్పటిలా అప్పుడు ఫోనులులేవాయే. ఉన్నా ఫోనులు ఇంత ఇంత బాగా లేవు. అవికూడా సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. ఏ సారు మా లో ఎవరికి చెప్పాడో తెలువదు కానీ.... . గూనపెంకను ఫోను గా చేయాలని ఆలోచన వచ్చింది. గుండ్రని గూనపెంకకు ఒక దిక్కు పేపర్లు అంటు పెట్టాం. దొడ్డు చీపురు పుల్ల 2 inch లు ఉన్నది తీసుకున్నాం. ఆ పుల్లకు దారం కట్టి, పుల్లను పేపర్ కువత్తి లోపల పెట్టాం. బయటకు దారంతో తో చెట్ల పై నుండి వాళ్ల ఇళ్లకు కు మా ఇంటికి
వచ్చు నటుల చేసుకున్నాం. హలో.. హలో అంటూ మాట్లాడుకునేవాళ్ళం. తిన్నది, ఏమి చదువుతున్నది తదితర విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆనాటి ఆ తీపి జ్ఞాపకం ఈనాటికీ మనసులో భద్రంగా ఉంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి