అనగనగా ఓ అందగత్తె. ఆమెను ఓ సామాన్య రైతు ప్రేమించాడు.
కానీ అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తెను ఓ ధనవంతుడికిచ్చి పెళ్ళి చేయడానికి ముమ్మరంగా ప్రయత్నించారు.
అయితే ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోలేదు.
ఓ ధనవంతుడైన యువకుడు ఆ అందమైన అమ్మాయి ప్రేమ గురించి తెలుసుకుని ఆమెను ప్రేమిస్తున్న యువకుడిని చంపేసాడు.
తన తమ్ముడిని హత్య చేసిన ధనవంతుడి వివరాలు తెలుసుకున్న ప్రేమికుడి అన్నయ్య ధనవంతుడైన యువకుడిని కత్తితో పొడిచి చంపాడు.
తమ కూతురు కారణంగా ఇద్దరు యువకులు చనిపోయిన విషయం తెలుసుకుని అమ్మాయి తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు.
మరోవైపు ఆ అమ్మాయికూడా తీవ్ర మనోవ్యధతో ఓ రోజు చనిపోయింది.
ఇంటి పెరట్లోనే ఆమె భౌతికకాయాన్ని పూడ్చిపెట్టారు.
ఆమె తల్లి రోజూ తన కన్నీటితో కూతురు సమాధిని కడుగుతూ వచ్చింది.
ఓరోజు ఆ సమాధిపైన చిన్న మొక్క మొలిచింది. ఆ మొక్కను పీకి విసిరేయడానికి ఆమె ప్రయత్నించింది.
అయితే ఆ సమయంలో తన కూతురుకున్న దంతంలాటి వెల్లుల్లిని ఆ మొక్కలో చూసింది. అది తన కూతురు దంతమే అని నమ్మిన ఆ తల్లి పెరటినిండా వెల్లుల్లి మొక్కలను సాగు చేసింది.
అలాగే వెల్లుల్లి చరిత్ర మొదలైందన్నది ఫిలిప్పైన్స్ కథనం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి