సాయంకాల సమయమున
సింధూరం రంగు లోనా
బండి చక్రము వోలె
సూర్యుడేమో పడమటన
దీపకాంతి వెలుగు లోన
అవని తల్లి ఒడి లోన
పక్షులన్నీ మెల్లె మెల్లిగా
వచ్చి చేరును గూటిలోన
పుడమిన సంధ్యా వెలుగులు
దగదగ మెరిసే జిలుగులు
వసుధమ్మ మోము జూడగా
బంగరు కాంతుల మెరుపులు
గగన తారల అందాలు
జాబిలమ్మకు బంధాలు
ఆకాశపు అందాలతొ
నేలమ్మకు అనుబంధాలు
సృష్టిన ధర్మాన్ని చూడగా
దుర్భల మయ్యేను నేడు
చందమామ వెలుగులోన
ఆటలాడ లేరెవరు నేడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి