అదా ...! ఇదా ...!!:- ------డా.కె .ఎల్.వి.ప్రసాద్ , హన్మకొండ .
అదుగో వేక్సిన్ 
ఇదుగో వేక్సిన్ 
వస్తుంది వేక్సిన్ 
వచ్చేసింది వేక్సిన్ 
అనుకుంటూ ....
నమ్మకం లేని వేదనలో 
నలిగిపోయిన రోజులను 
అందివచ్చిన 
అనుమానాలను 
వమ్ముచేస్తూ ......
వాక్సీన్ వచ్చేసింది 
మనముందుకు 
విశ్వదేశాల్లోనే 
అగ్రగామి అయింది 
మనభారత్ ...!
ఇప్పుడు -----
కొవేక్సిన్ వేసుకోవాలా ?
కోవిషీల్డ్ వేసుకోవాలా ?
అన్నది ....
సామాన్యుడి సందేహం !
ఈ గందరగోళంలో 
వేక్సిన్ వేసుకోవడానికి 
వెనక్కీ ముందుకీ ...
ఒకటికి మించి ఏదున్నా ,
ఎంచుకోవడం ....
ఇబ్బందే సుమా ......!
ఇది తికమక పెట్టే ...
సందర్భమే సుమా ...!!

       

కామెంట్‌లు