స్వాతిముత్యం:-ఝాన్సీ .కొప్పిశెట్టి ఆస్ట్రేలియా .
సిరుల నా తల్లి చిరునవ్వు చిందితే...,
సొగసుల పూబోడి నిండార నవ్వితే...,

వెన్నెల పిండార బోసినట్లు..
జాబిలమ్మ ముంగిట వాలినట్లు..!

మంచి ముత్యాలు రాలి పడినట్లు..
అమృతం వానై కురిసినట్లు..!

మంచు బిందువులు తడిసి ముద్దైనట్లు..
అమావాస్య చీకట్లు రంగులద్దుకున్నట్లు....!!

              పుట్టినరోజు శుభాకాంక్షలతో 
                           అమ్మ 
                   ఝాన్సీ .కొప్పిశెట్టి 
                   ఆస్ట్రేలియా .
ఫోటోలో....కనిష్ఠ కుమార్తె  శ్రీమతి స్వాతి.-స్వాతి. రౌతు  (అమెరికా)

కామెంట్‌లు