మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలమది.
ఓ సైన్యాధిపతి తెగ తాగుబోతు. అతను అనేకసార్లు తన తాగుడు కారణంగా శిక్ష అనుభవించినతనే.
అయినా అతనిలో మార్పు రాలేదు.
ఓరోజు అతనిని ఓ ఉన్నతాధికారి ఎదుట హాజరుపరిచారు.
"నీకెన్నో సార్లు శిక్ష విధించినా నువ్వు మారలేదు. ఇక నీకున్నది ఒకటే దారి" అన్నాడు ఉన్నతాధికారి.
ఆయన పక్కనున్న మరొక అధికారి "ఏమిటా దారి" అని అడిగాడు నెమ్మదిగా.
"అదా. ఏమీ లేదు. ఇప్పటివరకూ అతనిపై మనం ప్రయోగించని ఓ శిక్ష ఉంది. దానితో అతనిలో మార్పు తీసుకురావచ్చు" అన్నాడు ఉన్నతాధికారి.
"ఏమిటా శిక్ష?"
"క్షమించడం. ఇదే అతనిపట్ల మనం విధించాల్సిన శిక్ష" అన్నాడు ఉన్నతాధికారి.
"అవును" అన్నాడు మరొకతను.
తాగుబోతుని చూసి "నిన్ను క్షమిస్తున్నాను. నువ్వెళ్ళొచ్చు" అన్నాడు ఉన్నతాధికారి.
తాగుబోతు మనసులో "క్షమించడం" అనే మాట బాగా పని చేసింది. ఊహాతీతంగా అతను తాగడం మానేసాడు. తనకప్పగించిన విధులను సవ్యంగా నిర్వర్తించాడు.
అందుకే అంటుంటారు
ఒక్కొక్కప్పుడు క్షమించడం అనేదే పెద్ద శిక్ష అని!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి