సమోసా -(బాల గేయం)--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
చూడు చూడు సమోసాలు 
వేడుకైనవి దిలాసాలు 
రుచిగా ఉండే అల్పాహారం 
పిల్లా పెద్దా కులాసాలు !

పెళ్లి, పుట్టినరోజు పార్టీ 
స్నేహితులుకు సమావేశం 
సాయంకాలం ఛాయ్ తోటి 
సరదా కబుర్ల కాలక్షేపం !

ఆలూ క్యారెట్ ఉల్లిపాయలు 
సమోసా లోపల కమ్మనికూర 
అసలు కిటుకు ఆకారం 
తయారీ లోనే ఉందండి !

చిన్నపూరీని చేసి మడిచి 
కూరను నింపి అతకాలోయ్ 
సమోసాల బండి వస్తే 
నిముషాలలో ఖాళీనోయ్ !


కామెంట్‌లు