మనిషికొక్క గ్రూపు ,
గ్రూపునిండా
పెద్ద గుంపు ,
అడగ కుండానే
అందులో ,
అందరికీ ...
చోటు వచ్చేస్తుంది !
గుర్తు తెలియని వ్యక్తి ,
గ్రూపులో చేరిస్తే ...
వ ళ్లు మండిపోయి
వెంటనే వాకౌట్ (లెఫ్ట్ )*
గ్రూపు నిర్మాత ..
ఎరిగున్నవాడయితే ,
మొహమాటానికొక
థాంక్ యు సర్ ..
మెసేజ్ ....పంపుడు !
ఈ డజన్ల కొద్దీ
జమ అయిన గ్రూపులు ,
పంపించే ..చెత్త
టన్నులకొద్దీ చేరి ,
అసలు మెసేజిలకి గండి !!
మొహమాటం గ్రూపులతో
మొహం మొత్తి ...
మొబైల్ నే ...
నేలకేసి కొట్టాలన్నంత కొపం ,
ఆపని చేయలేక ..
మనల్ని మనం
కాసేపు తిట్టుకుని,
చేసేది లేక
'లెఫ్ట్ 'మార్గాన్నే
ఎంచుకోడం
మంచి మార్గం
అనిపిస్తుంటుంది !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి