రేపటి నీ రక్షణకై : ---- కిలపర్తి దాలినాయుడు

 రేపటి నీ రక్షణకై నన్ను నాటుము
ప్రకృతి పరిరక్షణయను వీణ మీటుము!
పచ్చని సైన్యము తోడును
పలుచబరచకు!
వెచ్చని ఈ అమ్మ ఒడిని
చించి వేయకు!
నీముందు నీవెనుకను
మమ్ము నిలుపుకో!
పచ్చని హస్తమ్ము మాది
మమ్ము కలుపుకో!
ఓ నరుడా నీసుఖమే
కోరుకొందుము
వనములుగా నాటుమని
వేడుకొందుము

కామెంట్‌లు