మబ్బుకు జై:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 అవిగో మబ్బులు

అవిగవిగో మబ్బులు

నింగిలోన మబ్బులు

తేలిపోవు మబ్బులు

పారిపోవు మబ్బులు

రకరకాల మబ్బులు

దూదిలాంటి మబ్బులు

చిన్నచిన్న మబ్బులు

పెద్దపెద్ద మబ్బులు

నల్లనల్లని మబ్బులు

తెల్లతెల్లని మబ్బులు

నీళ్ళులేని మబ్బులు

తెలుపురంగు మబ్బులు

వానతెచ్చు మబ్బులు

నలుపురంగు మబ్బులు

తెలుపు నలుపు మబ్బులు

అందమైన మబ్బులు

మబ్బులంటె ఇష్టమే

మబ్బులంటె అందమే

అందుకే మబ్బుకు జై!


కామెంట్‌లు