చందమామ ...చల్లదనం......!!:- ---డా .కె .ఎల్ .వి.ప్రసాద్ , హన్మకొండ .
చంద్రోదయం 
అయింది ....
చందమామ 
వచ్చాడు ...
పుచ్చపువ్వులాంటి 
తెల్లని వెన్నెల 
తెచ్చాడు ....!

ఆ...చల్లని వెన్నెల్లో 
ఆ ...చక్కని వేళలో 
వెన్నెలస్నానాల్లో 
ఎంతహాయిగా -
ఉంటుందో ...!

ఆటలు ఆడుకుంటూ 
పాటలు పాడుకుంటూ ,
కథలు చెప్పించుకుంటూ 
ఆనందంగా గడిపే -
చక్కని అనుభవం 
సేదదీరే సమయం !

చందమామని చూసిన 
అనుభూతి ---
చల్లని తెల్లని వెన్నెల 
అందించే -
మధుర స్మృతులు 
యాంత్రిక జీవితాలతో 
ముడిపడ్డ -
పట్నాలకు దూరం !

పల్లెలకే -
అది స్వంతం ....
అదే వారి అదృష్టం !!

----------------------------      
ఫోటో లో...బేబి  ఆన్షి. నల్లి


కామెంట్‌లు