బాలలు బంగారు
చేయాలి అ, ఆ లు షూరు
ఏ,బి,సి,డి లు ఎందుకు సారు
మాతృభాష ఎంతో మేలు గురు
నింపాలి వారిలో స్పూర్తి
తెలుగు పైనే పూర్తి
అదే వారి భవితకు దీప్తి
చిరస్థాయిగా నిలిపే కీర్తి
తెలుగు మన మాతృభాష
దాని వెలుగుపైనే మన ధ్యాస
కావాలి తెలుగే మన శ్వాస
అవుతుంది తెలుగే ఒక నిషా
అది అమృతపు చుక్క
అనురాగాల చెక్క
ఆత్మీయతలు పక్కా
ఆప్యాయతలు ఎంచక్కా!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి