మనం మెదడును ఎంత వినియోగిస్తున్నాం!?:-ప్రతాప్ కౌటిళ్యాMSc ( Bio-chem)M.tech (Bio-Tech)
 సాధారణంగా మనం మెదడును ఎంత ఉపయోగిస్తున్నాం మనకున్న మెదడు సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగిస్తున్నామా?
లేకాదాంట్లో కేవలం 10 శాతం కానీ లేదా 50 శాతం కానీ ఉపయోగిస్తున్నామా.?మనిషి తనకున్న మెదడు సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగిస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి!?
నిజానికి మెదడులో 100 బిలియన్ ల నాడీ కణాలు ఉంటాయి కానీ ఆ 100 మిలియన్ల నాడీకణాలు కేవలం ఒక ముద్దు లాగానే ఉన్న దాంట్లో వివిధ విభాగాలుగా భాగాలుగా ఉంటాయని గమనించాలి. అంటే మెదడు కుడి ఎడమ భాగాలుగా ముందు వెనుక మెదడు భాగాలు గా ఉన్నప్పటికీ నాడీ వ్యవస్థ లో భాగంగానే కొనసాగుతూ చిన్న మెదడు పెద్ద మెదడు వెన్నుపాము గా అందులో భాగమేనని మనకు తెలుసు. దీన్నిబట్టి మనకు ఏం అర్థమవుతుంది అంటే మెదడులోని భాగాలన్నీ వివిధ విభాగాలుగా ఉంటూ వివిధ విధులను నిర్వర్తిస్తూ ఉంటాయని అర్థం చేసుకోవాలి. మెదడులో శరీరంలోని ఒక్కో భాగంలో ఒక్కో అవయవానికి సంబంధించిన లేదా ఒక్కొ విధులకు సంబంధించిన సామర్థ్యాన్ని విధులను నిర్వర్తించే భాగంగానే ఉంటాయి. అంటే మెదడులో ఒక్కో పనికి ఒక్కో భాగం దానిలో ఆ విభాగపు నాడీ కణాలు ఉంటాయి అని అర్థం చేసుకోవాలి.కాకపోతే ఒక దానికొకటి సంబంధం కలిగి ఉండి సహకరించు కోవడం వలన ఒక వివాహ విధి జరుగుతుంది. మెదడులో ఏ విభాగంలో నైనా ఒక పని జరగాలంటే ఆ విభాగపు విధి నిర్వహణలో భాగంగా ఒక ఆలోచన పుట్టాలంటే ఎన్ని నాడీకణాలు దాంట్లో పాల్గొంటాయి.!?. ఏదేని విభాగంలో నాడీకణాలు అన్ని సమూహంగా కలిసి పాల్గొంటే తప్పా ఆ విభాగపు విధి నిర్వహణ పూర్తిగా జరగదు. ఉంటే ఆ విభాగపు లోని ఎన్ని నాడీ కణాలు ఉంటాయోఅవి అన్ని పాల్గొని ఆ విధులను నిర్వర్తిస్తాయి అని అర్థం చేసుకోవాలి. ఒక్క నాడీకణం కూడా దాంట్లో పాల్గొనకుంటే ఆ విధి నిర్వహణ సంపూర్ణంగా జరగదని గుర్తుంచుకోవాలి. మన మెదడునిర్వర్తించే చే విధిలో భాగంగా ఆ విభాగపు నాడీ కణాలు దాని పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తూ వినియోగించుకుంటున్న అనాకుని తెలుసుకుంటే చాలు. అంటే మనం మన మెదడును 100% ఉపయోగించుకుంటున్నారు అని అర్థమవుతుంది. అంతేగాని కే పట్టంవలం 10% శాతం మాత్రమే మనం మెదడును ఉపయోగిస్తున్నా మనీ భావించడం ఒక అపోహ మాత్రమే అది ఒక అశాస్త్రీయ భావన అనీ అర్థం చేసుకోవాలి..
మెదడు విశ్వం లాగా ఇన్ఫినిటీ కాదు అది ఒక లిమిటెడ్ లిమిటేషన్ లోనే ఉంటుందని అది ఒక ప్రామాణికం మాత్రమేనని గమనించాలి.
మనకు ఒక ఆలోచన వచ్చిందంటే అది మన మెదడు వంద శాతం వినియోగించుకోవడం వల్లనే ఆలోచన వచ్చినట్లు గుర్తించాలి. మనం ఒక పని చేస్తున్నామంటే మన మెదడు ని 100% ఉపయోగించుకున్న ట్లేననీ గమనించాలి.
ఉదాహరణకు ఒక బెలూన్లు లోకి మనం కొంత గాని అంతకన్నా ఎక్కువ గాని గాలిని పంపిస్తే అది ఆ బెలూన్లోపలి ఉపరితల పరిమాణం అంత విస్తరిస్తుందనీ దాని పీడనం ఘన పరిమాణం కూడా తెలియజేస్తుంది. సరిగ్గా అలాగే మెదడులోని నాడీ కణాలు అన్నీ ఒక్కో పనికి ఒక్కో విధి కీ ఒక్కో ఆలోచనకు కూడా
వందశాతం పని చేస్తే తప్ప ఆ పనీ జరగదని గుర్తుంచుకోవాలి.
కాబట్టి మనం 100% మన మెదడును ఉపయోగిస్తున్నామనీ తెలుసుకుంటే చాలు.
మెదడు సామర్థ్యం ఇంటలిజెంట్ కోషంటులూ అనువంశిక లక్షణాలు అంటే దాన్ని డి ఎన్ ఏ జన్యువులు నిర్ధారిస్తాయి.
మెదడు నాడీ కణాలకు ఇచ్చే శిక్షణ వలన మనం మన మెదడు పనితీరును విధుల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చును. కేవలం శిక్షణ వల్లనే ఆ విభాగపు నాడీకణాల సామర్థ్యం పెరుగుతుంది.
Pratapkoutilya-M tech-8309529273

కామెంట్‌లు