అందరూ చేత్తో బొమ్మలు గీస్తారు.చేతి వేళ్ళతో పెన్సిల్నో, కుంచెనో పట్టుకొని చిత్రాలు
వేస్తారు.కానీ ఈ కేరళ కుట్టి మాత్రం… కాళ్ళతో
బొమ్మలు వేస్తుంది.కాలి వేళ్ళతో పెన్సిల్,కుంచె
పట్టుకొని చిత్రాలను చిత్రిస్తుంది.అవును మరి
ఆమెకు రెండు చేతులూ లేవు మరి.కాళ్ళనే ..
చేతులు గా చేసుకొని చిత్రకళ పట్ల తనకున్న మక్కువకు సారి కొత్త అర్థం చెబుతోంది.
చిత్రకళాప్రపంచం తన పేరును తప్పక గుర్తుపెట్టు
కునేలా..తనకంటూ చిత్రకళాప్రపంచం తనకంటూ
ఓ స్థానాన్ని పదిలం చేసుకుంది.
ఆమెపేరు..స్వప్న అగస్టీన్..(Swapna Augustine)
కేరళకు చెందిన ఈ అమ్మాయి కాళ్ళతో ఎన్నో అద్భు
త చిత్రాలను వేస్తూ...చిత్రకళకు కొత్త రంగులద్దుతోం
ది. ఈమె…." Mouth and Foot painting arts association " లో సభ్యురాలు కూడా. world renowned motivational speaker Nick Vujicic in Dubai ఈమెకు స్ఫూర్తి ప్రదాత కావడం
విశేషం.
సృష్టిలో ఎన్నో అద్భుతాలున్నాయి. అలాంటి ....
అద్భుతాలలో స్వప్న అగస్టీన్ కూడా ఓ అద్భుతం.
పుట్టుకతోనే రెండు చేతులూ లేవు.చిత్రకళ పట్ల
రుచి,అభిరుచీ వున్నాయి.చేతుల్లేవుకదా అని ఆమె
ఊరుకోలేదు.కొండంత ఆత్మవిశ్వాససాన్ని ప్రోది
చేసుకుంది.తన కాళ్ళనే చేతులుగా మార్చుకుంది.
చిత్రప్రపంచాన్ని తన కాళ్ళదగ్గరకే రప్పించుకుంది.
చేతుల్లేని లోపాన్ని ఊహల్లోకి కూడా రానీకుండా
కాళ్ళకు పనిచెప్పింది. మనసులోని భావాలను
గీతలుగా గీసి,వాటికి రంగుల పరిమళాల్ని అద్దింది.
చూస్తూ.. చూస్తూ వుండగానే ఆ చిత్రాలకు రెక్కలొ
చ్చి ..చిత్రకళా ప్రపంచంలో అందమైన తూనీగల్లా ..
ఎగరడం ప్రారంభించాయి..ఆమె "స్వప్న " లోకంలో
ఇప్పుడు ఎన్నో రంగు రంగుల 'చి(సి)త్రాలు.'....!
మనిషిలో అవయవ లోపాలుండటం అతని తప్పు
కాదు.ముఖ్యంగా పుట్టుకతో కలిగే అంగవైకల్యం
ఖచ్చితంగా ఆ సృష్టికర్త తప్పే. లోపం వుంది కదా
అని కుంగిపోకుండా..లోపాన్ని కూడొ అడ్వాంటేజ్
గా మలుచుకోవాలి. ఇది చెప్పినంత తేలికేం కాదు.
కష్టపడాలి. ఇందుకు బోలెడు సానుకూలదృక్పథం
అవసరం.స్వప్న అగస్టీన్ లో ఈ గుణం కాస్తఎక్కువ
గానే వుంది.అందుకే ఆమె లోపాన్ని మరిచి, సాను
కూల దృక్పథంతో ముందడుగు….వేసింది. తనలోని చిత్ర కళాభిరుచిని కాన్వాసుపై పరిచి రంగుల చిత్రా
ల్ని సృజిస్తోంది. లోకం చూపును తన వైపుకు తిప్పు
కునేలా చేసింది.
If you look at what you HAVE in life and use it positively as your strength then you'll always have MORE than you think you have!
Swapna Augustine thank you for inspiring a generation.
అమ్మా ! స్వప్న..మీకు.. salute..!!
*A.Raja Hussain
(ఎ.రజాహుస్సేన్ )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి