పిల్లల ఆటలు మణిపూసలు:-పొట్టోల్ల లహరి-10వ, తరగతి-Zphs గుఱ్ఱాలగొంది-జిల్లా సిద్ధిపేట-చరవాణి:9704865816

చిట్ల బొట్ల కాయలు 
చిమ్మ డోని కాయలు 
చిన్న పిల్లలాయిగా
ఆడుకునే ఆటలు

పిల్లలందరు కలిసారు 
ఒక్క దగ్గర చేరారు 
ఏంచక్క ఆడదామని
వాళ్లు ఆలోచిస్తున్నరు

అగ్గిపెట్టె ఆటలను
ఆడుదాము అందరును
అనుకుంటు కూడుకొని
అందరొచ్చి యాడిరి

ఇంతమంచి ఆటలను 
అందరు మర్చిపోయెను
మంచి ఆటలు ఇంకెన్నొ
మరుగున పడిపోయెను

ఇప్పుడన్ని పోయెను
స్మార్టు ఫోన్లు వచ్చెను
పిల్లలంత అందులోనె
ఆటలాడు చుండెను

కామెంట్‌లు