*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౬౫ - 65)

 కందము :
*సుత్రామనుత జనార్ధన*
*సత్రాజిత్తనయనాథ | సౌందర్య కళా*
*చిత్రావతార దేవకి*
*పుత్రా ననుగావు నీకు | పుణ్యము కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
దేవేంద్రుని చే పొగడబడిన వాడా, దుర్జనులను, రాక్షసులను సంహరించిన వాడా, రాజు సత్రాజిత్తు కూతురు అయిన సత్యభామ భర్తవు, అందమైన అపురూపమైన ఎన్నో అవతారములను ఎత్తిన వాడవు,  దేవకీదేవి కుమారుడా,  నీకు పుణ్యం వుంటుంది నన్ను కాపాడు, నందనందనా..అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు