కరోనేమొ వచ్చింది
కలకలము రేపుతుంది
ఎటు చూసిన కరోన
ఎదురుపడును కరోన
టీవి పెడితె కరోన
పేపరుజూస్తెకరోన
ఎవరినోట విన్నను
కరోన మాట యుండెను
పక్కవారిఇండ్లకెళితె
రానివ్వరుకరోన
స్నేహితులను కలుస్తమంటె
తల్లిదండ్రులు వద్దంటారు.
బడుల కెళ్లి చదువుకుంటే
బందుపెట్టిరి కరోన
శాస్త్రజ్ఞులు కష్టపడి
కనిపెట్టిరి మందును
నీ ఆటలు సాగవు
నిన్ను సాగనంపుతాము
మూతిమాస్కు పెట్టుకొని
నీ మూతి మూస్తము
దూర దూరముంటము
నిన్ను దూరము పంపుతాము
పారిపోవె కరోన
పాతి పెడుతముకరోనా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి