స్వాగతం సుస్వాగతం: -గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి-నాగర్ కర్నూల్ జిల్లా.-ఫోన్ నెంబర్.9491387977.

నాయకులారా ప్రజా నాయకులారా వినరండి

మా కోరిక మన్నించి మమ్ముల దీవించి మా దారిని కనరండి

విచ్చేసిన వచ్చేసిన మాకు నచ్చేసిన మా నాయకులారా

మెచ్చేసిన కల్వకుర్తి రాగల గీతాల గానం చేసిన గాయకుల రా

స్వాగతం మీకు సుస్వాగతం


కల్వకుర్తి కావుల  కీర్తి పెంచి నట్టి మా మేలెంచినట్టి

మా నివాస సీమ యందు మీరు ఉడుం పట్టు పట్టి

జనం కష్టసుఖాలు స్థానికంగా తెలుసుకున్న వారు

ప్రతి దినం సహకరించి సమర్థించి ముందు కొచ్చినారు

అందుకు స్వాగతం సుస్వాగతం


బీడు పట్టా భూములను దర్శించుకున్న వారు

అడ్డు వచ్చిన వారిని తొలగించుకున్న వారు మీరు

ఏరికోరి చేరి ఎత్తిపోతల పథకాన్ని ఎంచుకున్న వారు

కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని సాధించుకున్నారు

అందుకోండి అందుకే మా వందనాలు

ముందుండి విందుచేసి పొందు తో చేసిన మా బహు చందనాలు

మా జనం గణంగా అందించే మా ప్రియ చందనాలు

జనం మనం కలిసి ఇ స్పందించిన తేజోమయ ఇంధనాలు

అందుకే మీ అందరికీ స్వాగతం సుస్వాగతం

ఎందుకో తెలుసుకోండి ఇప్పుడైనా నా ఆ గతం స్వాగతం

తన శక్తితో నడపండి మీరంతా మన మన ప్రగతి రథాన్ని

జ్ఞాన ముక్తి తో గడపండి మీ శేష జీవనసుగతి పథాన్ని 



కామెంట్‌లు