వెలుగు ..!! (బాల కథ ):-___డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,హనంకొండ . 9866252002

 శృతి 
పేదింటి పిల్ల .చదువులో చాల చురుకైనది .ఆటపాటల్లో ముందువరుసల్లో ఉంటుంది.ఆమె తెలివిని బట్టి ఒక మంచి కాన్వెంట్ 
లో ,తక్కువ ఫీజులతో సీటు సంపాదించాడు వాళ్ల 
నాన్న  రాజు .నిజానికి వాళ్ల తాహతుకు మించింది 
ఆ బడి.అయినా శృతి తెలివి తేటలను బట్టి ,కష్ట 
పడి అయినా కూతురిని చదివించాలని తల్లి _
దండ్రులు నిర్ణ యించుకున్నారు.
పిల్లలందరూ ,కార్లు ,స్కూట ర్ ,సైకిళ్ళ మీద బడికి 
వస్తుంటే ,శృతి నడిచి వెళ్లేది .దానికి ఆమె ఎప్పుడూ 
బాధ పడేది కాదు .సెలవురోజుల్లో తప్ప ఏనాడూ 
శృతి బడి మానలేదు.అన్ని సబ్జెక్టుల్లో నూ ,ఆమె 
ప్రథమ శ్రేణిలో నిలిచేది .
అంత ప్రతిభ ఉన్నా ,టీచర్స్ తప్ప తోటి విద్యార్థులు 
శ్రుతిని మెచ్చుకునే వారు కాదు .అయినా శృతి 
పెద్దగ బాధపడేది కాదు .
ఒక రోజు చివరి పిరియడ్ అయిపోయాక అందరూ 
గ్రౌండు లో ,ఆడుతున్నారు ,శృతి మాత్రం ఒక చెట్టు 
క్రింద కూర్చుని అదేపనిగా ఏడుస్తున్నది .ఇది దూరం 
నుంచి ,తన సహాధ్యాయి రఘు గమనించాడు .
క్లాసులో శృతి తరువాత రెండో స్ఠానం లో  రఘు 
ఉంటాడు.రఘు పరిగెత్తుకుని వెళ్లి 
" శ్రుతీ ఎందుకు ఏడుస్తున్నావ్ " అన్నాడు.
శృతి మాట్లాడలేదు. 
" శృతీ ..ప్లీజ్ ..చెప్పవా ?"అడిగాడు రఘు .
అప్పుడు శృతి పెదవి విప్పింది .
" నాకు ఎత్తు పళ్లు ఉన్నాయని ,అందరూ గేలి 
చూస్తున్నారు.మా ..నాన్నకు ,ఈ ఎత్తు పళ్లకు 
వైద్యం చేయించే శక్తి లేదు " అంది ..మళ్లీ వస్తున్న 
దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తూ .
" ఓస్ ..దీనికేనా ! నువ్వు దైర్యంగా ఉండు.మా 
నాన్నగారు ,మంచి ఆర్థోడాంటిస్ట్.డాడీకి చెప్పి 
నీకు వైద్యం చేయిస్తాను ,దీనిగురించి ఇక ఎప్పుడూ 
బాధ పడకు " అన్నాడు పెద్ద బరోసా ఇస్తూ .
శృతి కళ్లల్లో వెలుగు చూసి రఘు ఆనందపడ్డాడు .
అప్పటినుంచి ,రఘు _శృతి ,మంచి స్నేహితులై ...
పొయారు.

                 
కామెంట్‌లు