చిత్రకవిత:- సత్యవాణి

 చేరింది ఒక పిచుక 
చెట్టుపై తాను
గూడు కట్టగ పిచుక గుబులుపడ సాగె
పుల్లలు పుడకలు
పోగుజేసింది
గుట్టుగా పిట్టేమొ
గూడు కట్టింది
గూటిలో మెత్తని 
గడ్డి పరచింది
గడ్డిలో కూర్చొని
గ్రుడ్లు పెట్టింది
గుట్టుగా పొదిగింది
గువ్వంటి పిచ్చుక
గ్రుడ్లు పిల్లలాయె
గున గునా పెరిగె
కిచ కిచల భాషతో
ఆకలని చెప్పె
అమ్మ పిచ్చుకెళ్ళింది
ఆహారం కొరకు
అవ్వ చెరుగు చుండె
రవ్వంటి ధాన్యం
అవ్వ చెంతను వ్రాలె
అమ్మ పిచ్చుకమ్మ
అవ్వ కదులుట కొరకు
ఆత్రముగ జూసె
అవ్వ అటు వెళ్ళగా
రివ్వున్న వ్రాలి 
చేటలో గింజలను
చిరునోట పట్టి
గూటిలో పిల్లలకు
ఘుమ్మునందించె
కిచ కిచల పిచ్చుకమ్మ
తెలివిగలదమ్మా
పట్టగా దొరకదు 
పై పైకి యెగురు
పిట్ట కొంచము చూడ
తెలివి మెండమ్మా
చిన్ని మా పిచ్చుకకూ
శ్రీరామరక్ష
కలకాలమీజాతి
కలిగి వుండాలి
         
కామెంట్‌లు