అక్కడ .....నేలంతా ,
పచ్చని తివాచీ పరిచినట్టు
నిత్యం నిగ నిగ లాడుతుంటుంది,
పొలాలన్నీ ...
పచ్చని పైరుతో
ఉయ్యాల లూగుతుంటాయ్ !
కార్మిక ..కర్షకులతో,
కష్టించి పనిచేసే కూలీలతో,
కోడికూతతో పనిలేకుండానే ,
తెల్లవారుతుందక్కడ !
మెట్టభూములన్నీ ...
నారికేళ వృక్ష సముదాయంతో
జిరాఫీల్లా ..తల పైకెత్తి ,
ఆప్యాయంగా ..
పలకరిస్తుంటాయ్ .
జీవితాంతం ..
జీవన భృతిని
అందిస్తుంటాయ్ !
గోదావరి గట్టు ....
గ్రామాలను ..పొలాలను ,
విడదీసే ఏటిగట్టు ..కు,
ఇరువైపులా ...
గుబ్బ గొడుగుల్లాంటి చెట్లు,
బాడీ గార్డుల్లా ...నిలబడి,
బాటసారులకు
మార్గదర్శనం చేస్తుంటాయ్ !
కష్టపడడం ఎలాగో ..
కష్టించి ...
తృప్తిగా బ్రతకడం ఎలాగో ,
క్రమశిక్షణగా జీవించటం ఎలాగో ,
సహజంగా నేర్పుతుంది
ఈ ప్రదేశం !
ఇదే ...నా ఊరు
నను గన్న ఊరు ..
నను పెంచి ..పోషించిన ఊరు ,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి