ముక్తి నిచ్చు వాడు ముక్తీశ్వరు డతడు
పుణ్యతీర్థమందు పుడమి మీద
జగమునేలు తండ్రి జగ్గయ్య పేటలో
దక్షిణమున వెలిసె దయను జూప
ఆరునెలలు స్వామి హాయిగా నీటిలో.
దాగినాడుపూజ తనరలేక
గంగతల్లిజేసె ఘనముగా పూజలు
జనము జూసి రపుడు జలము నందు
పలువిదముల ప్రజలు ప్రార్థన జేయగా
మాయబ్రతుకు వద్దు మాకు స్వామి
కాశి లోన వున్న కాశీశ్వ రుడవయ
శరణు కోరినాము మరువబోకు
నీటిలోన యుండి నేటికి నందులు
పూజలందుచుడు పురము నందు
శివుని వాహనమని చిత్తమునగొలువ
భారమంతదీరు బ్రతుకు లోన
మహిమ లున్నవాడు మల్లికార్జు నసామి
మదిన గొలువగాను మంచి జరుగు
భక్తిమార్గమందు ముక్తియు కలుగును
మాయలోనభక్తి మరువరాదు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి