ఉప్పు -బాల గేయం :-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
ఉప్పు కారం మామిడిముక్కలు 
అద్దుకు తింటే ఆహా మజాలు 
ఉప్పు ముఖ్యం ఆరు రుచులలో 
ఆహార నిల్వలో ఉప్పుకీలకం 

ఊరగాయలు వరుగుల కోసం 
ఎండిన ఉప్పు ఎంతో మేలు 
పెట్టుబడి లేని సేద్యం ఉప్పు 
సముద్రం ఇచ్చే రుచియే మెప్పు 

చిన్న చిన్నవి గట్లు అమర్చి 
ఉప్పు నీటిని కయ్యకు చేర్చి 
రోజుల తరబడి ఎండాలోయ్ 
ఉప్పు దిగుబడి పొందాలోయ్ 

నీరు ఆవిరై ఇసుక కిందకు 
తెల్లని ఉప్పు కణికలు పైకీ 
నైపుణ్యం తో అటుఇటు త్రిప్పి 
గోతపు సంచుల ఉప్పును నింపి!

గాడిదల పైన గతంలో వచ్చే 
చెక్క సైకిల్ పై నేడూ వచ్చే 
ఉప్పోయమ్మ అంటూ అరుపు 
దేశీయఉప్పు ఆరోగ్యం అదుపు


కామెంట్‌లు