విశ్వాసమే బలము:-వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయిదాస్, సిద్దిపేట.
ఆధునిక విద్యలు పెరిగెను 
ఆత్మ తేజంబును పెంచుము 
ఆడంబరములు మానుము 
కలిగుండుము చైతన్యము

విద్య లేని జీవితము 
విద్యుత్తు లేని నగరము 
విద్వత్తు లేని కవనము 
ప్రేమలు లేని జీవనము 

శునకమునకు

విశ్వాసము 
మనకు ఆత్మ ఆత్మవిశ్వాసము 
ఉండవలెను మెండుగాను 
వదలవలెను అవిశ్వాసము 

చీమల చూసి నేర్వవలె 
క్రమశిక్షణతో నడువవలె 
సంఘటితముగనుండవలె 
ఉన్నత విద్యలు చదువవలె

కామెంట్‌లు