నేటి ..నానీలు ..!! (ఆరోగ్యమే మహాభాగ్యం): --------డా.కె.ఎల్.వి.ప్రసాద్- హన్మ కొండ .

అనారోగ్యం ఎవరికైనా,
బాధాకరం ...!
అందరిఆరోగ్యమే ....
ఆనంద కరం ..!!
-------------------------------
అతను అన్నిరకాల 
సంపన్నుడట ....! 
డబ్బుతో  కాదు ...
సంపూర్ణ ఆరోగ్యం తో ..!!
------------------------------------
ఆనందం -ఆరోగ్యంతో 
జతకట్టింది ...!
అనారోగ్యం తక్షణం 
తోకముడిచింది ..!!
------------------------------------
మితమే -హితంగా 
అన్నీ తినవ చ్చు ....!
కొర్కెకొండెక్కితే,
మనిషి 'పాడె'పాలు ..!!
---------------------------------------

కామెంట్‌లు