పాండు పెద్ద పిసినారి. తేరగా ఏదైనా దొరుకుతుంది అంటే దాన్ని వదిలిపెట్టకుండా తినేవాడు. తాను మాత్రం పైసా కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. అలాంటి పాండూకు దారిలో పోతుంటే ఒక చెల్లని ఏభై రూపాయల నోటు దొరికింది. అది చెల్లని నోటు కాబట్టి ఎవరో రోడ్డున పడేసినాడు. పాండు ఆ నోటును తీసుకుని వెళ్ళి అనేక షాపులలో తనకు నచ్చిన తినుబండారాలను కొనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ చెల్లని నోటును ఎవ్వరూ తీసుకోలేదు. పాండు వాళ్ళ నాన్న కొన్ని సరుకులను తెమ్మని, డబ్బులను ఇచ్చాడు. పాండు ఆ డబ్బులలో ఓ 50 రూపాయల నోటును పక్కన పెట్టి, ఆ నోటు స్థానంలో ఈ చెల్లిని నోటును నోట్ల మధ్యలో ఉంచాడు. అయితే ఆ డబ్బులను లెక్కపెట్టే క్రమంలో ఎంతోమంది ఆ చెల్లిని నోటును తిరస్కరించారు.
ఇక లాభం లేదనుకుని పాండు రెండు మూడు గ్రామాలు దాటుకుని సుదూర ప్రాంతంలో ఉన్న ఒక గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక హొటల్ ముందు 50 రూపాయలకే చికెన్ బిర్యానీ అని రాసి ఉంది. పాండు తన వద్దనున్న చెల్లని నోటును ఇచ్చి బిర్యానీ పెట్టామన్నాడు. ఆ హోటల్ వాళ్ళు మారు మాట్లాడకుండా ఆ నోటు తీసుకుని బిర్యానీ వడ్డించారు. రుచిలో తేడా ఉంది కానీ తేరగా వచ్చిన దానిని ఎలా వదిలిపెట్టాలి? పూర్తిగా తిన్నాడు. వేగంగా తన ఊరికి నడిచి వెళ్తున్నాడు. అతను ఇచ్చిన చెల్లిని నోటుకు తగ్గట్టుగా ఆ హోటల్ వాళ్ళు పాచిపోయిన బిర్యానీ వడ్డించారు. పాండుకు దారి పొడవునా విరేచనాలు అయ్యాయి. ఇక పాండు అవస్థను ఊహించుకోండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి