ఒకరోజు నలుగురు పండితులు రాజాస్థానానికి వెళ్ళి,అక్కడ తమ పాండిత్యాన్ని ప్రదర్శించి, రాజు వద్ద మంచి మంచిబహుమామాలు అందుకొని హుషారుగా కబుర్లు చెప్పుకొంటూ నదివద్దకు వచ్చారు.
ఆ పండితులు తమ తమ గ్రామాలు చేరాలంటే ఆ నదిని దాటి వెళ్ళాలి. పడవవాడు ఆ నలుగురు పండితులనూ పడవ ఎక్కంచుకొని ఆ పడవను తెడ్డు సహాయంతో నపడం ప్రారంభించాడు.
పడవలో కూర్చున్న పండితులు రాజు గురించీ, రాజు ఇచ్చిన బహుమతులగురించీ, తమకు గలిగిన పాండిత్యంలోని ప్రతిభను గురించీ మాట్లాడుకొంటున్నారు. వారిలో ఒక పండితుడు హఠాత్తుగా,పడవవాడితో,"ఒరేయ్! పడవవాడా! నీవెంతదాకా చదువుకొన్నావురా?"అని ప్రశ్నించాడు.
పడవవాడు "అయ్యా !మాలాంటి వాళ్ళకు చదువులెక్కడవయ్యా!ఏరోజు కారోజు పిట్టను కొట్టా ,పొయ్యలో పెట్టా అనే మాబోటోళ్ళకు చదువులేమిటయ్యా?తమబోటి గొప్పోరికి గానీ ."అన్నాడు వినయంగా.
రెండవ పండితుడు "చదువుసంద్యలు లేని జన్మ పశుజన్మతో సమానం. "అన్నాడు .
మూడవవాడు" చూశావా!మా పాండిత్యానికి మెచ్చి రాజుగారు ఎన్నెన్నో కానుకలిచ్చారో"అన్నాడు.
నాల్గవ పండితుడు "చదువు సంద్యలు లేని జన్మ ,నిరర్థకం.అటు వంటి బ్రతుకు బ్రతికితేనేం ,చస్తేనేం "అన్నాడు ఈసడింపుగా.
పడవ సరిగ్గా ఆసమయానికి పడవ నది మధ్యభాగానికి చేరుకొంది.
ఆ పండితుల మాటలకు మనస్సు కష్టపెట్టుకొన్న ఆ పడవవాడు " అయ్యా పండితులవార్లూ!తమలో ఎవరికైనా ఈత వచ్చాండీ?"అని ప్రశ్నిచాడు .
"ఈతకొట్టవలసినంత అగత్యం మాకేమి పట్టింది.మేము పండితులం,దర్జాగా డబ్బులు పారేసి పడవఎక్కి వెళతాం అన్నారు పండితులు, చేతులకున్న బంగారు కంకణాలు సవరించుకొంటూ గర్వంగా.
ఆ సమయానికి పడవ నదిలో మధ్యభాగానికి వచ్చింది. వేంటనే పడవ వాడు ,"అయ్యా! పండితులవార్లూ,నేను మీకుమల్లే పండితుడిని కాదు కానీ, గజ ఈతగాడిని ,నా జీవనోపాధి ఇదేకనుక, నేను ఈతని బాగానేర్చుకొన్నాను. సముద్రాన్నికూడా అవలీలగా ఈదేయగలను. మరి నేను ఇప్పుడు ఈదుకొంటూ నదికి అవతల గట్టుకు పోతున్నా! మీ చదువులు మిమ్మల్ని అవతలగట్టుకు ఎలాచేరుస్తాయో చూస్తాను ."అంటూ వేంటనే నదిలోకి దూకి,ఈదుకొంటూ అవతలి గట్టుకు చేరిపోయాడు.
నదిమధ్యలో పడవలో వున్న పండితులు నలుగురికీ భయంతో నోటమాట రాలేదు. ఈత రాకపోవడం వలన,అవతలగట్టుకు చేరే మార్గం తెలియక భయంతో హాహాకారాలు చేస్తూ ,ఏడవడం మొదలు పేట్టేరు.
దయాగుణంకల పడవవాడు,మళ్ళీ ఈదుకొంటూ వచ్చి, పడవలో ఆపండితులని అవతలి గట్టుకి చేరుస్తూ, "అయ్యా! పండితులవార్లూ! ఎవరి వృత్తి వారికి గొప్పది. ఇతర వృత్తులవారిని ఈసడించకూడదు ."అనగానే పండితులు సిగ్గుపడుతూ తలదించు కొన్నారు.
నీతి:--కోటివిద్యలూ కూటి కొరకే, కనుక ఏ వృత్తి పనివారినీ తక్చువగా చూడరాదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి