టీ శాట్ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యాబోధన ఉంటుందన్నారు.
కేజీ టు పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులే ఉంటాయన్న మంత్రి.. డిగ్రీ, పీజీ, డిప్లొమా పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇక కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.
అదే విధంగా ఫీజుల విషయంలో జీవో నంబర్ 46ని ఫాలో అవ్వాలని, నెలవారీగా ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కాగా ఇంటర్ సెకండియర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విడుదల చేశారు. ఇక ఆన్‌లైన్‌లోనే బోధన విషయానికొస్తే... 50 శాతం టీచర్లు ఒకరోజు.. మరో 50 శాతం టీచర్లు తర్వాతి రోజు క్లాసులకు హాజరయ్యేలా చూస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో జూలై 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి : వెంకట్ మొలక ప్రతినిధి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి