శార్దూలము:
*రాజై దుష్కృతిచెందె చందురుడు, రా | రాజై కుబేరుండు దృ గ్రాజీవంబునగాంచె దుఃఖము, కురు | క్ష్మాపాలుడామాటనే యాజింగూలె సమస్త రాజబంధువులతో | నారాజశబ్ధంబు ఛీ,*
*ఛీ! జన్మాంతరమందు నొల్లను జుమీ | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
చంద్రుడు రాజు అనిపించు కునే, ఇబ్బందులు పడ్డాడు. పద్మముల వంటి కన్నులతో రాజు అనిపించుకుని విచారమును కొని తెచ్చుకున్నాడు. ఇక, మనకు తెలిసిన రారాజు దుర్యోధనుడు, రాజు అనిపించుకుని, బంధువులు, స్నేహితులు, సైన్యం, రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఏమి రాజ శబ్దం, మహాప్రభో, శంభో, మాకు ఒద్దు నాయనా. మా కొద్దీ "రాజ" శబ్దం .....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*రాజువి, రారాజువి నీవు వుండగా వేరొక రాజుకు తావెక్కడ, భస్మధరా! చంద్రుని ఏనాడోనీవు తలకెత్తు కున్నావు కానీ, రాజు అనిపించు కోవాలనానుకున్నాడు, అమ్మ శాపానికి గురయ్యాడు. దృతరాష్ట్ర కుమారుడు చెప్పుడు మాటలు విని, ఏకంగా 18అక్షౌహిణుల సైన్యం తో సహా, రాజ్యాన్ని కోల్పోయాడు. ఎన్ని చెప్పుకున్నా, ఎవరి గురించి రాసినా, అన్నీ నీ పిదపనే కదా, భక్తవత్సలా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి