మత్తేభము:
*తరగల్ పిప్పలపత్రముల్ మెరుగుట | ద్దంబుల్ మరుద్దీపముల్*
*కరికర్ణాంతము లెండమావులతతుల్ | ఖద్యోతకీట ప్రభల్*
*సురవిధీలిఖితాక్షరంబు లసువుల్ | జ్యోత్స్నాపయః పిండముల్*
*సిరులందేల మదాంధులౌదురో జనుల్ | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
కెరటాల మీద వచ్చే నురగలు, రావి ఆకుల మీద, ఎనుగు చెవులమీద వుంచిన వస్తువు, మిణుగురు పురుగు ల వెలుగులు, ఎండమావుల మెరుపులు, ఆకాశములో రాయబడిన అక్షరములు, సిరులు సంపదలు, ప్రాణములు ఇవి అన్నీ చిరకాలంగా వుండవు అని తెలిసినా కూడా గర్వం తో వున్న మనుషులు వీటినే నమ్ముతూ వుంటారు. ఇది ఎలా సాధ్యమౌతుంది. అవుదు.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*ఈ ప్రపంచ మంతా మాయా నిర్మితమని తెలిసినా, మిణుగురులు మొదలైన అశాశ్వతమైన విషయాల వెనుక పరుగిడుతూ వుంటారు ఈ మనుషులు. అయినా,నీ మాయా మోహితులం కదా కపర్ధీ! ఇలా కనిపించిన ప్రతీ దాని వెనుక పరుగెత్తడం సరికాదు అని తెలుసుకుని మేము ఆచరించేలోపే కొత్త మాయను చూపిస్తావు కదా సుందరేశ్వరా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి