శార్దూలము:
*నీ పంచబడియుండగా గలిగిన | న్భిక్షాన్నమే చాలు ని*
*క్షేపంబబ్బిన రాజకీటకముల నే | సేవింపగా నోప, నా*
*శాపాశంబుల జుట్టి త్రిప్పకుమ సం | సారార్ధమై, బంటుగా*
*చేపట్టం దయగల్గెనేని మదిలో | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
నీ నీడలో వున్నప్పుడు దొరికే గుప్పెడు అన్నపు ముద్ద చాలు నాకు. రాజుల అనుగ్రహం తో వచ్చే సంపదలూ సుఖాలు నాకు ఒద్దు, ఈశ్వరా! నా మీద నీకు, నీ మనసులో ఏమాత్రం దయ వున్నా, కలిగినా, నాకు ఆశలూ, అందలాలూ చూపించి ఇక్కడే పడివుండేటట్టు చేయకు, నిశాచర సన్నిహితుడా!.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*శ్రీ రామునిచేత పూజింపబడిన నీ పాదాలు, విష్ణుమూర్తి సేవించిన నీ రూపంను సేవించే సద్భాగ్యం నాకు లభించాక, ఇంకా నేను నీ మాయచే సృష్టించబడిన రాజుల చెంతచేరి వారికి ఊడిగంచేసి, సంపదలు పొందుతానా, కాపాలికా! నిన్ను నమ్మి, నీ పొందు కోరి, నీతో స్నేహం దొరికిన తరువాత, నన్ను ఇంకా సంసార చక్రంలో పడవేస్తావా, పన్నగభూషణా! కపాల మాలాధరా, నీవు ఎంత మాయచేసే ప్రయత్నం చేసినా, నీ కరచరణాలు విడువను కాక విడువను,సుందరేశ్వరా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి