మత్తేభము:
*తనువే నిత్యముగానొనర్పుమదిలే | దా, చచ్చి, జన్మించకుం*
*డు నుపాయంబు ఘటింపు, మాగతులరెం | టన్నేర్పు లేకున్న లే*
*దని నాకిప్పుడెచెప్పు చేయగల కా | ర్యంబున్న సంసేవ జే*
*సి నినుం గాంచెదగాక కాలముననో | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
ఈ శరీరము, మనసు సత్యము, నిత్యము అని చేప్పు. లేదా, చనిపోయిన తరువాత మళ్ళీ పుట్టకుండా వుండటము ఎలాగో చెప్పు. ఈ రెండు పనులూ చేయడం నీవల్ల అవుతుందా లేదా, దైనా చెప్పు. మా గతి ఏమిటో, నిన్ను ఎలా తెలుసుకోవాలో అదయినా చెప్పు. మా తిప్పలు మేము పడి చనిపోయిన తరువాత నిన్ను చేరుకుంటాము. ....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*శివయ్యా, నువ్వు ఘటనాఘటన సమర్థుడవని మాకు తెలుసు. అందుకని, నీవు యిచ్చిన ఈ శరీరము, బాధలూ, శాస్వతములని చెప్పు. వాటితో వుండి పోతాము. లేదూ ముక్తి మార్గంలోకి ఎలా వెళ్ళాలో మార్గదర్శి వై చూపించు. అంతే కానీ, ఏమీ చేతకాని వానిలా,మౌనంగా కూర్చున్నా వు, ఏమిటీ ఆట స్వామీ, శాంభవీ మనోహరా! నేను నిన్ను చేరాలి, ఇది ముమ్మాటికీ నిజం కావాలి. ఆర్తజన రక్షకుడు అనే నీపేరు వృధా అవకూడదు. నీవు సర్వ సమర్థుడవు కనుక మాకు నీన్ను చేరే దారి చూపి, నీలో కలుపుకో, కారుణ్య మూర్తీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి