తాతయ్య కథలు-38. :- ఎన్నవెళ్లి రాజమౌళి

 బైకును తుడుచుకుంటున్న తాతయ్య తో-ఎక్కడికి తాతయ్య అని  మనవడు అడగగానే...
బెంగళూరు నుండి వంద రూపాయలు పంపారు. నా నవల కడలి కావాలట. లచ్చ పేట కు వెళ్లి పోస్టు చేస్తాను అన్నాడు తాతయ్య.
వాళ్లకు ఎలా తెలుసు తాతయ్య.
ఈనాడు పత్రికలో నా నవల గురించి సమీక్ష చూశారట. అంటూ తాతయ్య తయారై వెళ్లగానే-
చూసావు రా! మా నాన్న గొప్ప రచయితగా ఎదిగాడు. నీవు అలాగే రాయాలి అన్న నాన్నతో-
రాస్తున్న గా నాన్న. నా రచనలు మొలక న్యూస్ లో వస్తున్నాయి గా...  అవును వస్తున్నాయి కానీ, ఇంకా కథలు, కవితలు రాయాలి. అలా అని చదువులో అశ్రద్ధ చేయకూడదు అన్న నాన్నతో- సరే  నాన్న! అన్నాడు కొడుకు.


కామెంట్‌లు