అంతుచిక్కని రోగాల సుడిగుండాలను
అలవోకగా దాటించేది.. పతంజలి అష్టాంగ నియమాలు..
ఐ రా స ఆమోదయోగ్యమై
ప్రపంచ దేశాలను మన మాతృదేశంపై దృష్టి మరల్చినది యోగ..
ప్రకృతి సహజ ఆహర నియమాలతో
ప్రభాత వేళ సూర్యభగవానునికి
ప్రణమిల్లుతూ సూర్యనమస్కారాల సాధన
సకల ఆసనాల మేళవింపు
ఇల పింగళ నాడుల శోధన
సొంపైన నిర్ములీకరణ..
ప్రణాయామాలతో బాహ్యేన్ద్రియాల దృష్టి
అంతరంగమై శరీర మనోబుద్దులు ఏకీకృతమౌను
ధ్యాన సాధనతో
ఆత్మ అంతరాత్మతో లయమై
స్వరూప శూన్యం ఇతి సమాధి అదే ఆనందస్థితి.
చపల చిత్తం సమాగమమై
సకల రోగాలు నయమై
తనలోని ఆత్మ పరమాత్మతో
పరమ పురుషునిలో లీనమవ్వు
మనోచాంచల్యం మందగించి
కామ క్రోధ లోభ మద మాత్సర్యాలైన
అంతరంగ శత్రువులను
జైయిస్తాము
మనలో నిద్రాణంగా దాగి ఉన్న
చైతన్య శక్తులను మేల్కొలిపే
ఏకైక తాళం చెవి యోగ మాత్రమే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి