చైత్రగీతం:--నల్లగొండ రమేశ్ఆసీఫాబాద్ కుమ్రంభీంజిల్లా8309452179

 మా ఊరి చెరువు 
మా మంచి చెరువు
మా ఊరి చెరువు
మా అందరి బ్రతుకుదెరువు
మా చెరువు నిండితే
మా దరికిరాదు ఏ కరువు
మా ఊరి చెరువు నిండితే
అదే మాకు కల్పతరువు
మా ఊరి చెరువే మాకు గోదారి
మా ఊరి చెరువే  మాకు దేవేరి
తనుంటే లేదు ఏ చింత
తనుంటే లేదు ఏ కొరత
తన చుట్టు  మా చిననాటి ఙ్ఞాపకాలు అల్లుకున్నాయి..
తనతోటే  మా మధురస్మృతులు వెల్లువవుతాయి....
తన చుట్టూ జీవవైవిధ్యం  తొణికిసలాడును
తన గట్టే మాతో ఆనందాలతో ఊసులాడును
ఊరిపొలిమేరల్లో
చెట్టుచేమల నడుమ అందాల మా చెరువు 
కనుపించును వసంతంలా
పచ్చని పొలాల్లో  పంట చేలలో అలలచెరువు
వినిపించును చైత్రగీతమిలా..

కామెంట్‌లు