'9వ 'అంకె విశిష్టత. ............?:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
పసి(డి) హృదయ నేస్తాలూ !మీకు అంకెలు,సంఖ్యలు తెలుసుగా, మనకున్న అంకెలు సున్నాను తీసివేస్తే మొత్తం (9) తొమ్మిది.అవి
1,2,3,4,5,6,7,8,9.వీటి మొత్తము కుడితే 45 వస్తుంది.4+5---9.మరి 9 అంకె ప్రత్యేకత ఏమిటో మనం తెలుసుకుందాం.
            సంఖ్యాశాస్త్రంలో  ఈ9అంకెను బ్రహ్మ సంఖ్య అని అంటారు. ఇంకా దీనికి దైవ సంఖ్య, వృద్ధి సంఖ్య,, పురాణాల సంఖ్య, మృత్యుంజయ సంఖ్య అని పలు పేర్లు కూడా ఉన్నాయి.
            మీరు ఏదైనా నా మీకు ఇష్టమైన సంఖ్యను తీసుకుని, ఆ సంఖ్యను 9 చే హెచ్చించండి. ఫలితాన్ని మొత్తం కూడి ఏక సంఖ్య ను చేయండి ఇ అప్పుడు తొమ్మిది వస్తుంది.
ఉదా"-----4213645 ఇది మీకు ఇష్టమైన సంఖ్య. అయితే దీనిని 9 చే హెచ్చించ గా 37922805 వస్తుంది దీని మొత్తం కొడితే 36 అవుతుంది. ఏక సంఖ్య చేయగా 3,6 కూడితే తొమ్మిది వస్తుంది.ఈవిధంగా ఎంత చిన్న,పెద్ద సంఖ్యనైనా హెచ్చిస్తే వచ్చేది9.
యుగాలు...
1కృత.1728000-----18=9
2త్రేత1296000.......18=9
3ద్వాప 864000......18=9
------------------------
మొత్తం..3888000.....27=9
పై మూడు యుగాల మొత్తము=9
మన మహాభారతం 9వ సంఖ్య తో ముడిపడి ఉంది. ఇందు మొత్తం పర్వాలు=18=1+8=9
యుద్ధం జరిగిన మొత్తం దినములు..,.......18=1+8=9
సైన్యం 18 అక్షౌహిణి లు...1+8=9
భగవద్గీత అధ్యాయాలు..18=1+8=9.
వ్యాసమహర్షి ఇ రచించిన పురాణాలు.....18=1+8=9
సృష్టిలో ప్రతి ప్రాణికి 9 రంధ్రాలుంటాయి. ఒక సర్పానికి తప్ప. శిశువును తల్లి తన గర్భంలో తొమ్మిది మాసాలు మోస్తుంది
గంటకు 3600 సెకండ్లు కూడాగా
3+6+0+0=9 అవుతుంది.
రోజుకు 1440ని,లను కూడగా
1+4+4+0=9 వస్తుంది.
నెలకు720గం,=7+2+0=9.
సంవత్సరానికి 360 రోజులు కూడగా 3+6+0=9
ఇలా మనం పైన పేర్కొన్న కారణాల వల్ల ఈ 9 అంకె అన్ని అంకెల కన్నా మిన్నయని రుజువయ్యింది గా నేస్తాలు

అన్ని అంకెల కన్న మిన్న
ఈ తొమ్మిది అంకేనే అన్న
తెలుసుకొరా నీవు చిన్నా
కలుసుకొని ఆడ రా కన్నా!

అంకెల ఆటలే ఆడుకోరా
సంఖ్యల పాటలే పడుకోరా
ఆటపాటలను ఒప్పుకోరా
మాట మూటలను విప్పుకోరా!



కామెంట్‌లు