నేటి నాయకులు మేకవన్నె పులులు
అధికారం చేతులున్నపుడే
నాలుగుతరాలు తిన్నా తరగనంత సంపాదించే
బహు ఖతర్నాక్ ఊసరవెల‌్లులు
ఎనకేసకున్నదంతా కాపాడుకునేందుకు గోడదూకే పిల్లులు
రాజకీయ చదరంగంలో ఆరితేరిన ఘనులు
ఎత్తుకు పై ఎత్తులేసి జిమ్మిక్కులేసే నేర్పరులు
కండువాలు సమాయాన్నిబట్టి మార్చుకునే విలువలు తెలిసిన వినయవంతులు
మంచి ఆటగాళ్లు
జనాలెప్పటికి కళ్ళే తెరవని మత్తులో తేలే మహాముదురులు
మందుబాబులు
ఆటలో చప్పట్లు చరిచే అమాయకులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి