ఏం మాయరోగమో ఇది:-మచ్చరాజమౌళి. దుబ్బాక. 9059637442

 అరుగుమీద కూచున్న అవ్వ
అంటుండేది అప్పుడప్పుడు 
ఏం మాయరోగమో ఏమో
ఈ మనుసులకి 
ఇటు పిలిస్తే అటు పోతరు
అటు పిలిస్తే సుత్తరు
పోగాలం దాపురిస్తె వద్దన్నా ఆగదని
పొడిచి పొడిచి చెప్పేది
పాటింటన్రో, పలుకింటన్రో గాని
పొడిశిన పొద్దు సూత్తలేరు
తడిశిన బట్ట సూత్తలేరు
శేతల ఫోనట్టుకొని
శెవులల్ల గదేందో పెట్టుకొని
జప్పజప్ప నడిస్తే
ఝామురాతిరయ్యేది తెల్వదు
జర్రున జారిపడేది తెల్వదు


కామెంట్‌లు