ఎవరు ఎవరని యంటారు నిత్యా సౌభాగ్యవతియని
అగుపించదా..యట్టి తరుణి గా0చిన గనులకు నరవరా..
నుదుట సింధూరము ఎరుపు మందారము తనువంతాభరణముల తొడుగు
మునిపొద్దు సంద్యల మెఱియు భరణి
వసంతవానల తలంటుకోని మాగాణి మడుల మడిగట్టుకోని
నవమాసాల దీక్షతో నవరత్న దాన్యములను
నరులకందించు సుభిక్షిణి సుధారాణి
సూడసూడ చాలునా కళ్ళు రెండునూ
ఆ తల్లి సుందర వైభోగములను ఆనందపరవశములను
జల జల నదులై పాదాలు పరుగెడుతుంటే..
ఆ పరుగుల వేగమున జ్వలించే నాదాలే
సుస్వరాలు సప్తసంగీత స్వరాలు
కవితా భావకులవి అయ్యే మంచి నేస్తాలు
చిగురు కొమ్మ రెమ్మల నడుమ అటాడే
సీతాకోకచిలుకలను
తనచీరలో ముద్రికలుగా ఒదిగించి
పుప్పొడులను వేదజల్లు పూలవనాలనే
ఆమె సిగల గూర్చి గుత్తులు గుత్తులుగా ..కూర్చున్నా ముత్తైదా మన పుడమితల్లి
మాపటి పొద్దువర్ణాలు ఆమె పెదాల ఎరుపులు
నీరెండ పొలుపులో తొలుకు అలల మెరుపుకాంతులే
ఆమె తనువు తళుకులు
తొలిపొద్దు తూర్పు సమీరాలే ఆమె సొగసు సౌజన్యములు కాదా.....!,
చిరు చిరు నగవులే విరజాజి విరుపులు
తొడిబిడి తొందర డోలికలే ఆమె తొలివలపులు
హేమంత ఋతువులో సీమంతమాడి
రజనీజల బిందువులనే
ముక్కోటి దేవుళ్ళు ఆశీర్వాదించి జల్లిన అక్షింతలుగా ఆస్వాదిస్తూ
ఏటా మురుసిపోయే తల్లి
గా0చినా గనులకు యగుపించదా ఓ నరవరా...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి