నడిచే దైవము:-డా గాజులనరసింహ--నాగటూరు గ్రామం,కర్నూలు జిల్లా9177071129

 పల్లవి :- ఆ ఆ ఆ ఆ .....
ఆ చల్లని సముద్రగర్భం ఈ చక్కని పరిమళ కుసుమం 
అమ్మ...అమ్మా.....2
ఆ దేవుడి ప్రతిరూపం ఇలన నడిచే ఈ రూపం
అమ్మ...అమ్మా...
ఆ అమ్మకు సరి ఎవ్వరంట 
సకల లోకాలు పలికే సదా అంట..""ఆ చల్లని""కో 

చరణం:-1 
మల్లెకంటే చక్కనిది అమ్మలోని చక్కదనం
తేనెకంటే  తియ్యనిది అమ్మ మాటలోని తియ్యదనం 
ప్రతి గుండెల కొలువే అమ్మరా ..
ఆ అమ్మేలేని జగతే చీకటిరా..
ఆ చీకటి మబ్బుల వెలిగే చిరుదివ్వె అమ్మరా..అమ్మరా..
ఆ అమ్మతనంలోని కమ్మదనం కొలువ ఎవరితరం 
కాదని ఎవరి తరము ఆ దైవాలే తేల్చిచెప్పెర  2"" ఆ చల్లని""

చరణం :-2 
ఊహలకందని ఊపిరిరా  
భాసలకందని భావమురా..
తరతరాలుగా అవతరించు వరముగా
జన్మ జన్మాల తీరనీ ఋణముగా ...
అమ్మ ..అమ్మా...
ఒక సాగర సంగమమే అమ్మా..
ఒక మమతల మాన్యమే అమ్మా..ఆ అమ్మకు సరి ఏది లోకంలో ఈ లోకంలో..
ఎన్నో తీర్థముల పుణ్యఫలమే కలుగులే అమ్మ చరణం వేడిన  
వేదాలే సదా పలికెలే దైవాలే సుసించేలే ఈ యోచన 2  ""అమ్మ అమ్మా""కో"ఆ చల్లని""

కామెంట్‌లు