పాడిపంటలు ఇస్తుంది
ఎపుడు పచ్చగా ఉంటుంది
ఏటా తలంటుకుంటుంది
ఆమె ఎవ్వరంటా...? (భూమాత)
నవమాసాలు మోస్తుంది
బిడ్డకు జన్మినిస్తుంది ఓ తల్లి
కడుపున మోయకనే బిడ్డకు
జన్మను ఇస్తుంది అరే... ఓతల్లి
అది ఎవ్వరంటా ..... ? (పక్షి)
తప్పులు చేస్తే కొడతాడు
బుద్ధులు బాగా చెబుతాడు
అజ్ఞానపు చీకటిలో వెలుగులిస్తాడు
కాదండోయ్ సూర్యుడు వాడు ఎవ్వరంటా ....? (గురువు)
అమ్మ కొడితే నాన్న అంటా
నాన్న కొడితే అమ్మా... అంటా
ఇద్దరుకలిసి కొడితే ఒకేసారి
అరే... నేను ఏమంటా...?(దేవుడా)
రోజూ తిట్టే ఒకడంటా..
రోజూ కొట్టే ఒకడంటా...
అరే కొట్టిక తిట్టక చంపే ఒకడంటా..
అరెరే...! సచ్చింది ఎవ్వరంటా...?(దోమ)
వానలేదు మంచులేదు
చేను తడిసే ఎట్ట0టా..
నీళ్లు లోపల ఉన్న బావియ0టా
పైకి వచ్చే నీళ్లు ఎట్ట0టా..?.(మోటర్ వలన)
ప్రాణం లేని ఒకటి
ఎగిరే పైకివోచ్
కాళ్లులేక ఖండాలు దాటే
అది ఏందోచ్ ..?(విమానం)
మాటలు చెబుతుంది వింటుంది
పాటలు బాగా పాడుతుంది
నోరే లేదు దానికి అసలు
అది ఏందోచ్...?(చరవాణి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి