మేము రాగ జీవులం
భగవంతుని చదరంగంలో
పావులం.
గదులల్లో చేరుకొని
కామ్య సిద్ధికై
ఆరాటపడే
మూగ ప్రాణులం
ఆమె -- నేను
మే మెలాగైనా
ఏకం కావాలని
సౌఖ్యం పొందాలని
ఆరాట పడుతున్నాం
అహోరాత్రులు
తపిస్తున్నాం
కౌగిళ్ళ తన్మయతకై
ఒకరినొకరం
జపిస్తున్నాం
జలధరిస్తూ ఉన్నాం
మేము....
కమ్మగా కలసిపోయి
కామకేళిలో
అలసిపోయి
భావి జీవులకు
బాటలు వేస్తాం
ప్రేమ పావులకు
జీవం పోస్తాం
మాతోనే ప్రగతి
మాతోనే జగతి
అందుకే మమ్మల్ని
ఐక్యం చేస్తున్నది
ఆనందభారతి
ఆ భగవంతుడే
మా మనో కథ
సారధి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి